భారతదేశం, మార్చి 25 -- గద్వాల జిల్లా మల్దకల్ మండలానికి చెందిన ఓ యువతికి తల్లిదండ్రులు లేరు. ఆమె తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ చదువుకుంది. డిగ్రీ పూర్తి చేసిన అనంతరం ఓ ప్రైవేటు కంపెనీలో టెలీ కాలర్‌గా వర్క్ ఫ్రం హోమ్ జాబ్ చేయడం ప్రారంభించింది. కానీ టెలీ కాలర్‌గా పని చేయడం వల్ల వచ్చే ఆదాయం సరిపోకపోలేదు. ఇంకా ఏదైనా జాబ్ చేయాలని నిర్ణయించుకుంది.

ఉద్యోగం కోసం గతేడాది మార్చి 10న ఉదయం హైదరాబాద్ మహానగరానికి చేరుకున్న యువతి.. ఎంజీబీఎస్ బస్టాండ్‌లో దిగింది. ఈ క్రమంలో అక్కడ ఓ ఇద్దరు అమ్మాయిలు ఉండగా.. వారు మెల్లిగా బాధిత యువతితో మాట కలిపారు. పరిచయం పెంచుకుని, యువతి వివరాలు తెలసుకున్నారు. ఎక్కడికి వెళ్లాలో ఆరా తీయగా.. బాధిత యువతి తాను దిల్‌సుఖ్‌నగర్ వెళ్లాల్సిందిగా సమాధానం ఇచ్చింది.

తాము కూడా అటు వైపే వెళ్తున్నామని నమ్మించి, ఆమెను హయత్‌నగర్ వైపు తీసుకెళ్...