తెలంగాణ,వరంగల్, మార్చి 19 -- ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, ఆమెపై అత్యాచారానికి పాల్పడి వ్యభిచార రొంపిలోకి దింపే ప్రయత్నం చేసిన ముఠాను వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరుగురు సభ్యుల ముఠాలో ఓ మైనర్ బాలిక, వ్యభిచార గృహం నడిపే మహిళ, నేర చరిత్ర కలిగిన నలుగురు యువకులు ఉండగా.. వారందరినీ పట్టుకుని కటకటాల వెనక్కి పంపించారు.

వారి వద్ద నుంచి 4,320 కండోమ్ ప్యాకెట్లు, ఒక కిలో 800 గ్రాముల గంజాయి, ఒక కారు, 75 వేల రూపాయల నగదు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా వెల్లడించారు.

సీపీ వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా దామెర మండలం ల్యాదెళ్ల గ్రామానికి చెందిన ముస్కు లత అనే మహిళ కొంతకాలంగా వ్యభిచార గృహం నడిపిస్తోంది. తన బిజినెస్ కోసం మైనర్ బాలికలకు ట్రాప్ చేయడం మొదలుపెట్టిం...