భారతదేశం, జనవరి 3 -- వరంగల్ సెంట్రల్ జోన్‌ కాజీపేట పీఎస్ పరిధిలో శుక్రవారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కాజీపేట విష్ణుపురి కాలనీలో గాలి పటాలు, చైనా మాంజా బిజినెస్ చేస్తున్న శనిగరపు అరవింద్, ఎండీ ఇస్సాక్, మంద శ్రీనాథ్, ఎండీ సాల్మన్ అనే నలుగురు వ్యాపారులను అరెస్ట్ చేశారు. వారి నుంచి మొత్తంగా రూ.2.30 లక్షల విలువైన 115 బండిళ్ల చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న మాంజా దారం బండిళ్లను కాజీపేట పోలీసులకు అప్పగించారు.

సంక్రాంతి పండుగ సమయంలో సరదాగా ఎగురవేసే గాలి పటాలు.. జనాల ప్రాణాలు తీస్తున్నాయి. సాధారణ దారాలకు బదులు మార్కెట్‌లో చైనా మాంజా లభిస్తుండటంతో చాలామంది దానినే ఉపయోగిస్తున్నారు. నైలాన్‌, సింథటిక్‌ దారానికి ప్లాస్టిక్‌ పొడి పూసి మాంజాను తయారు చేస్తున్నారు. గాలి పటాలను ఎగురవేసే సమయంలో ఇతరుల పతంగు...