భారతదేశం, ఫిబ్రవరి 21 -- ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామెడ్ మండలం రాసపల్లి గ్రామానికి చెందిన హిడ్మా.. మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఆయన కూతురు వంజెం కేషా కూడా చిన్నతనంలోనే చైతన్య నాట్య మండలిలో పని చేశారు. మావోయిస్టు పార్టీకి చెందిన సభ్యులతో పరిచయాలు కావడంతో.. 2016లో పామెడ్ లోకల్ స్క్వాడ్ కమాండర్ గొట్టె కమల ద్వారా మావోయిస్టు పార్టీలో చేరారు కేషా.

రెండు సంవత్సరాలపాటు పున్నెం జోగ అధ్వర్యంలో.. చైతన్య నాట్య మండలిలో పని చేసింది కేషా. ఇదే సంవత్సరం కేషాను పార్టీ నాయకత్వం అబూజ్​‌మడ్​ ప్రాంతానికి బదిలీ చేసి.. కేంద్ర కమిటీ సభ్యుడు కడారీ సత్యనారాయణ రెడ్డికి ప్రొటెక్షన్ గ్రూప్ సభ్యురాలిగా నియమించారు. ఆ తరువాత 2021 సంవత్సరంలో కేంద్ర మవోయిస్టు నాయకత్వం.. కేషాను గొత్తికోయ ఏరియా కమిటీ సభ్యురాలిగా నియమించింది.

2022 డిసెంబర్ వరకు ప్రొ...