భారతదేశం, ఏప్రిల్ 13 -- మంత్రి సీతక్క.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రూరల్ వాటర్ సప్లై, స్త్రీ, శిశు సంక్షేమంపై ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లు చేసిన పనులు క్వాలిటీగా ఉంటేనే బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేశారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోడ్లతో పాటు ఇతర అభివృద్ధి పనులకు అధికారులు డెడ్ లైన్ పెట్టి కాంట్రాక్టర్లతో పనులు చేయించాలని.. మంత్రి సీతక్క ఆదేశించారు. రోడ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఎలాంటి బేషజాలు లేకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాను సమగ్ర అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలన్నారు. ఎస్సీ డెవలప్మెంట్ కింద ఇచ్చిన సీసీ రోడ్లను అధికారులు కాంట్రాక్టర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి.. పనులు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాల...