భారతదేశం, ఫిబ్రవరి 11 -- తెలంగాణలో రాహుల్‌ గాంధీ ఆకస్మికంగా పర్యటించనున్నారు. సాయంత్రం 5:30 గంటలకు శంషాబాద్‌కు రాహుల్‌ రానున్నారు. అక్కడినుంచి చాపర్‌లో వరంగల్ రానున్నారు. చెన్నై పర్యటన నేపథ్యంలో హనుమకొండలో ల్యాండింగ్ అవ్వనున్నారు. వరంగల్‌లో కాసేపు రాహుల్‌ గాంధీ రెస్ట్ తీసుకోనున్నారు. విద్యార్థులతో ముఖాముఖిలో భాగంగా ట్రైన్‌ ప్రయాణం చేయనున్నారు రాహుల్.

ఢిల్లీ నుంచి చెన్నైకి తమిళనాడు విద్యార్థులతో కలిసి రాహుల్ గాంధీ రైలు ప్రయాణం చేయాల్సి ఉంది. రాత్రి 7:30 గంటలకు రాహుల్ గాంధీ చెన్నై ప్రయాణం మొదలు కానుంది. ఈ ప్రయాణంలో భాగంగా.. వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో రైలు ఎక్కనున్నారు రాహుల్‌. విద్యార్థులతో కలిసి ముఖాముఖిలో పాల్గొననున్నారు. తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో రాహుల్ గాంధీ ప్రయాణించనున్నట్టు తెలుస్తోంది. వరంగల్ నుంచి చెన్నై వరకు ట్రైన్‌లో విద్యార్థులతో ...