భారతదేశం, మార్చి 16 -- కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి జాతర నేపథ్యంలో వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లక్ష్మీ నరసింహస్వామి జాతర కోసం వెళ్తున్న క్రమంలో.. గిర్నిబావి వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ ప్రభ బండ్లు ఎదురుపడ్డాయి. తమ పార్టీకి చెందిన బండ్లను ఆపేసి, కాంగ్రెస్ ప్రభ బండ్లను పంపిస్తున్నారంటూ గులాబీ పార్టీకి చెందిన కొందరు ఆందోళనకు దిగారు.

దీంతో ఇరుపార్టీల నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. రెండు పార్టీలకు చెందిన లీడర్లు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నేతలు ఆందోళన చేపట్టి, అక్కడ పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను ధ్వంసం చేసి, ముందుకు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. వారికి, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటం, తొక్కి...