భారతదేశం, మార్చి 1 -- మామునూరు ఎయిర్ పోర్టు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. మామునూరు ఎయిర్ పోర్టు గురించి క్రెడిట్ ఫైట్ జరిగింది. వరంగల్ ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. వేర్వేరుగా బీజేపీ, కాంగ్రెస్ సంబరాలు జరిపాయి. ఒకే సమయంలో ఎయిర్ పోర్ట్ ప్రధాన గేటు దగ్గరకు ఇరు పార్టీల కార్యకర్తలు చేరుకున్నారు. పోటాపోటీగా ప్రధాని మోదీ చిత్రపటానికి బీజేపీ, రేవంత్ చిత్రపటానికి కాంగ్రెస్ శ్రేణుల పాలాభిషేకం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు భారీగా మోహరించారు.

మామునూరు విమానాశ్రయ అభివృద్ధికి ఆమోదం తెలుపుతూ.. కేంద్ర పౌర విమానయాన శాఖ శుక్రవారం (ఫిబ్రవరి 28న) ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విమానయానం కల త్వరలోనే సాక...