భారతదేశం, ఏప్రిల్ 1 -- Waqf bill: వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లుపై బుధవారం లోక్ సభలో చర్చ ప్రారంభం కానుంది. పార్లమెంటులో సజావుగా బిల్లును గట్టెక్కించాలని అధికార బీజేపీ పక్షం, బిల్లును గట్టిగా వ్యతిరేకించాలని విపక్ష కాంగ్రెస్ శస్త్రాస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, అసలు వక్ఫ్ అంటే ఏమిటి? వక్ఫ్ బిల్లులోని వివాదాస్పద అంశాలేమిటో ఇక్కడ చూద్దాం.

బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వక్ఫ్ బిల్లు కింద ప్రతిపాదించబడిన సవరణలు వివాదాస్పదమయ్యాయి. వక్ఫ్ ఆస్తులను నియంత్రించడంలో, వాటికి సంబంధించిన వివాదాలను పరిష్కరించడంలో ప్రభుత్వానికి అధికారం ఇచ్చేలా ఈ సవరణలు ఉన్నాయి. అందువల్ల వీటిని ముస్లిం సంస్థలు, ఎంఐఎం వంటి పార్టీల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనున్న వక్ఫ్ బిల్లులోని ప్రతిపాదిత సవరణలలో ప్రధానంగా ఐదు అంశాలను ఆల్ ఇం...