భారతదేశం, ఫిబ్రవరి 13 -- వక్ఫ్ సవరణ బిల్లు 2024పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) రూపొందించిన నివేదికను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈ నివేదికను ప్రతిపక్షాలు విమర్శించాయి. తాము సమర్పించిన అసమ్మతి నోట్‌లలోని కొన్ని భాగాలను తొలగించారని ఆరోపించాయి. రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. ఈ గందరగోళం నడుమ నివేదికను రాజ్యసభ ఆమోదించింది. మరోవైపు జేపీసీ ఛైర్మన్ లోక్‌సభ ముందుకు నివేదిను తీసుకొచ్చారు. అక్కడ కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో కాసేపు సభను వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమైనా.. ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి.

దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. 'ప్రతిపక్ష సభ్యులు కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, వివాదం ఏదైనా.. మీరు పార్లమెంటరీ విధానం ప్రకారం తగిన రూపంలో చేర్చాలి. అసమ్మతి నోట్‌లను ...