భారతదేశం, సెప్టెంబర్ 15 -- వక్ఫ్ సవరణ చట్టం 2025ను పూర్తిగా నిలిపివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే ఒక ఆస్తి.. ప్రభుత్వ ఆస్తి కాదా అని కలెక్టర్ నిర్ణయించే అధికారాన్ని ఇచ్చే నిబంధనలతో పాటు కొన్ని కీలక అంశాలపై మాత్రం మధ్యంతర సోమవారం స్టే విధించింది.

వక్ఫ్ సవరణ చట్టం 2025లోని నిబంధనలపై స్టే విధించాలా వద్దా అనే దానిపై ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్, న్యాయమూర్తి ఏజీ మసిహ్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తాత్కాలిక ఉత్తర్వులను జారీ చేసింది.

కనీసం ఐదు సంవత్సరాలుగా ఇస్లాం మతాన్ని ఆచరిస్తున్న వ్యక్తి మాత్రమే వక్ఫ్‌ను ఏర్పాటు చేయాలని అనుమతించే నిబంధనపై కూడా సుప్రీంకోర్టు స్టే విధించింది.

వక్ఫ్ బోర్డు అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ. మతపరమైన, ధార్మిక లేదా సామాజిక ప్రయోజనాల కోసం ముస్లింలు దానం చేసిన ఆస్తులను ఈ బోర్డు నిర్వహిస్తుంది. ఈ ఆస్తు...