భారతదేశం, ఏప్రిల్ 12 -- West Bengal Violence: పశ్చిమ బెంగాల్ లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయి. పలు ప్రాంతాల్లో అవి రెండు వర్గాల మధ్య ఘర్షణలుగా మారి హింసాత్మకమవుతున్నాయి. శనివారం జరిగిన తాజా హింసాకాండలో పశ్చిమబెంగాల్ లోని ముర్షిదాబాద్ లో ఇద్దరిని ప్రత్యర్థులు నరికి చంపారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో రాష్ట్రంలో విస్తృత అశాంతి చోటు చేసుకుంది.

ముర్షిదాబాద్ హింసాకాండకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు 118 మందిని అరెస్టు చేశారు. పలు ప్రాంతాల్లో పోలీసు దాడులు కొనసాగుతున్నాయి. అల్లర్లు తీవ్రంగా ఉన్న ముర్షీదాబాద్ లోని సంసర్ గంజ్ ప్రాంతంలోని జఫ్రాబాద్ లోని తమ ఇంట్లో తండ్రీకొడుకులు కత్తిపోట్లకు గురై చనిపోయి కనిపించారు. పశ్చిమ బెంగాల్లో కేంద్ర బలగాలను ...