Hyderabad, ఫిబ్రవరి 3 -- భోజనం తర్వాత వెంటనే పడుకోవడం లేదా సోఫాలో గంటల తరబడి కూర్చోవడం ఆరోగ్యానికి హానికరం. కాబట్టి, భోజనం తర్వాత కొంతదూరమైనా నడవడం అనేది చాలా ముఖ్యం అని పెద్దలు చెబుతుంటారు. ఇలా చేయడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుచుకోవచ్చు. అనేక వ్యాధుల ప్రమాదం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. కానీ భోజనం తర్వాత నడవడానికి సరైన సమయం మీకు తెలుసా? తెలియకపోతే, భోజనం తర్వాత ఎప్పుడు నడవాలి? ఎంతసేపు నడవాలి? అనేది తెలుసుకుని ప్రయోజనాలను పొందండి.

ఎంత సేపటి తర్వాత నడవాలి: భోజనం తర్వాత నడవడం అవసరం, కానీ భోజనం, నడక మధ్య కొంత సమయం విరామం ఉండాలి. భోజనం తర్వాత శరీరానికి కనీసం 10-15 నిమిషాల విశ్రాంతి ఇవ్వండి. ఆ తర్వాత నడిచేందుకు ఉపక్రమించండి. ఈ విరామం మీ కడుపుకు జీర్ణక్రియ ప్రక్రియను ప్రారంభించడంలో సహాయపడుతుంది. నడుస్తున్నప్పుడు కలిగే క్రాంప్స్ ప్రమాద...