భారతదేశం, ఫిబ్రవరి 3 -- WakeUp Whatsapp: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మనమిత్ర వాట్సాప్‌ సేవలు ఆరంభంలోనే మొరాయిస్తున్నాయి. గత వారం ఏపీ మంత్రి నారా లోకేష్ మెటా భాగస్వామ్యంతో సులభతరమైన పౌరసేవల్ని అందించే మన మిత్ర వాట్సాప్‌ సర్వీసెస్‌ ప్రారంభించారు.

బటన్‌ నొక్కితే పౌర సేవలు అందిస్తానని యువగళం పాదయాత్రలో ప్రజలకు హామీ ఇచ్చానని దానిని నెరవేర్చేందుకు వాట్సాప్‌లోనే పౌర సేవల్ని అందించేందుకు మెటాతో వాట్సాప్‌ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్‌ ప్రకటించారు. టెక్నాలజీ ఇంటిగ్రేషన్‌ కోసం మెటాతో పలు మార్లు చర్చలు జరిపామని, అక్టోబర్ 23, 24న ఒప్పందం చేసుకుని డిసెంబర్‌ నెలకల్లా సేవల్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, నెల రోజులు ఆలస్యంగా వాట్సాప్ సేవల్ని ప్రారంభిస్తున్నట్టు లోకేష్‌ చెప్పారు.

మొదటి విడతలో 161 స...