ఆంధ్రప్రదేశ్,ఒంటిమిట్ట, ఫిబ్రవరి 15 -- ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో మహా సంప్రోక్ష‌ణ, కుంభాభిషేకం నిర్వహించనున్నారు. మార్చి 6 నుంచి 9వ తేదీ వరకు ఈ కార్యక్రమాలను చేపట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఇందుకోసం ఆలయంలో మార్చి 5వ తేదీ సాయంత్రం 5.30 గంట‌ల‌కు విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, వాస్తు హోమం, అంకురార్పణం జరుగనుంది.

శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో గ‌త ఏడాది సెప్టెంబర్ 6 నుండి 8వ తేదీ వ‌ర‌కు బాలాల‌యం నిర్వ‌హించిన విష‌యం సంగతి తెలిసిందే. సాధారణంగా గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం "బాలాలయం" చేపడతారు. ఇందుకోసం ఆలయంలోని మండపంలో నమూనా ఆలయం ఏర్పాటుచేసి గర్భాలయంలోని మూలవర్ల చిత్ర‌ప‌టాల‌ను ఏర్పాటు చేశారు.

కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలను పండుగ వాతావరణం తరహాలో ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో శ్యామల రావు ఆదేశించారు. ఈవో ఆదేశాల ...