భారతదేశం, ఏప్రిల్ 7 -- Vontimitta Sitaramula Kalyanam : ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11న జరగనున్న సీతారాముల కల్యాణోత్సవం పండుగ వాతావరణంలో భక్తులందరూ వీక్షించేలా ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఒంటిమిట్టలో జరిగిన సమీక్షాలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర విభజన అయ్యాక దేవాదాయ శాఖ నుంచి ఒంటిమిట్ట ఏకశిలానగరాన్ని 2015లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీటీడీలో విలీనం చేశారని, అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో టీటీడీ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని గుర్తు చేశారు.

2019లో కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు నాయుడు సూచనలతో సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేపడుతున్నట్లు...