భారతదేశం, మార్చి 26 -- Vontimitta Kalyanam : "పురాణాల ప్రకారం త్రేతాయుగంలో శ్రీ రామచంద్రుడు దండకారణ్యంలో సీతా లక్ష్మణ సమేతుడై సంచరించారు. సీతాదేవి దప్పిక తీర్చడానికి భూమిలోకి బాణం వేయ‌గా నీటి బుగ్గ పడింది. అదే ఒంటిమిట్టలోని రామతీర్థమైంది. సీత అన్వేషణ కోసం రావణ సంహారం కోసం శ్రీరామచంద్రునికి సహకరించిన హనుమంతుని ప‌రివారంతో పాటు జాంబవంతుడు కూడా ఉన్నారు.

ఆ జాంబవంతుడు సేవించిన సీత లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రుడే నేడు ఒంటిమిట్ట ఆలయంలో కొలువై ఉన్నారు. ఒకే రాతిపై శ్రీ సీత రామ లక్ష్మణ దేవత మూర్తులు ఉండడంవల్ల ఒంటిమిట్టను ఏకశిలా నగరం అని కూడా అంటారు. ఈ దేవాలయ నిర్మాణం 14వ శతాబ్దంలో ప్రారంభమై 17వ శతాబ్దానికి పూర్తయినట్లు ఆలయంలో ఉన్న శాసనాలు తెలుపుతున్నాయి. 1356లో బుక్కరాయలు, ఆ తర్వాత కాలంలో విజయనగరాజులు, మట్లి రాజులు క్రమంగా గుడి అంతరాల‌యం, రంగ మండపం, ...