Vontimitta,andhrapradesh, ఏప్రిల్ 11 -- ఒంటిమిట్టలో ఇవాళ సాయంత్రం శ్రీ సీతారామ కల్యాణం అత్యంత వైభవంగా జరగనుంది. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 గంటల మధ్య రాములోరి కల్యాణ వేడుక ఉండనుంది.

శ్రీ సీతారాముల క‌ల్యాణం సంద‌ర్భంగా ఇవాళ సాయంత్రం 6 గంట‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించనున్నారు.

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 7 గంట‌ల‌కు గరుడ వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణులు భక్తులకు అభయమిచ్చారు.భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు....