ఆంధ్రప్రదేశ్,కడప, ఏప్రిల్ 3 -- ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ఇవాళ శ్రీ కోదండరామస్వామివారి ఆలయ ప్రాంగణంలో 'హరిధ్రా ఘటనం' (పసుపు దంచే) సాంప్రదాయ కార్యక్రమం ప్రారంభమైంది. హిందూ సనాతన ధర్మంలో ఏదైనా శుభ కార్యక్రమం లేదా సాంప్రదాయ కార్యక్రమాలు పసుపు పొడి తయారీతో ప్రారంభమవుతుంది.
ఆలయ అర్చకులు శ్రీ మనోజ్ స్వామి మాట్లాడుతూ. హరిధ్రా ఘటనం సమయంలో తయారు చేసిన పసుపు పొడిని వార్షిక బ్రహ్మోత్సవాలలో అభిషేకం, కళ్యాణం, అక్షింతలు తయారీలోను, పలు శుభకార్యాల్లో ఉపయోగిస్తారన్నారు.
ఈ కార్యక్రమంలో వందలాది మంది మహిళా భక్తులు, శ్రీవారి సేవకులు రామనామ స్మరణతో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. టీటీడీ మహిళా ఉద్యోగులు ఈ శుభ సందర్భంగా ''సారె'' సమర్పించారు.
ఏప్రిల్ 05 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.