కడప,ఆంధ్రప్రదేశ్, ఏప్రిల్ 5 -- కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్ర‌హ్మోత్స‌వాలకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 6 నుంచి 14వ తేదీ వరకు వైభ‌వంగా జ‌రుగ‌నున్నాయి. ఇవాళ సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వ‌హించ‌నున్నారు.

శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలకు విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఆలయంలో ప్రత్యేక క్యూలైన్లు, ఎండవేడిని తట్టుకునేలా చలువపందిళ్లు ఏర్పాటుచేశారు. ఆలయ పరిసరాల్లో బారీకేడ్లు ఏర్పాటుచేశారు. ఆలయ గోపురాలు, కల్యాణవేదిక, ఇతర ప్రాంతాల్లో పుష్పాలంకరణలు, రంగురంగుల విద్యుత్‌ దీపాలు, విద్యుత్‌ కటౌట్లతో శోభాయమానంగా అలంకరించారు. భక్తుల కోసం అన్నప్రసాద వితరణ కౌంటర్లు తదితర ఏర్పాట్లు చేశారు.

ఏప్రిల్ 6న ధ్వజారోహణంతో శ్రీ కోదండరామస్...