తిరుమల,ఆంధ్రప్రదేశ్, మార్చి 23 -- క‌డ‌ప‌ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆల‌యంలో బ్రహ్మోత్సాలను జరపనున్నారు. ఈ మేరకు టీటీడీ ముఖ్య తేదీలతో పాటు వాహనసేవల వివరాలను వెల్లడించింది. ఏప్రిల్ 6 నుంచి 14వ తేదీ వ‌ర‌కు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా జరుగుతాయని పేర్కొంది.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో ఏప్రిల్ 1న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం ఉంటుంది. ఏప్రిల్ 5న బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌ నిర్వహిస్తారు. ఏప్రిల్ 11న సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ సీతారాముల క‌ల్యాణం వైభవంగా నిర్వహిస్తారు. బ్ర‌హ్మోత్స‌వాల‌లో ప్ర‌తి రోజు ఉద‌యం 7.30 నుంచి 9.30 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న సేవ‌లు జ‌రుగుతాయి.

ఏప్రిల్‌ 11న శ్రీ సీతారాముల కల్యాణానికి టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా నిర్...