తిరుమల,ఒంటిమిట్ట,కడప, మార్చి 29 -- ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఏకశిలానగరంలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీన ఉదయం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరుగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

ఏప్రిల్ 05 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అర్చన నిర్వహిస్తారు. ఉదయం 08 నుండి 11.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపడతారు. ఈ నేపథ్యంలో గర్భాలయం, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీగరుత్మంతుని సన్నిధి, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు.

అనంతరం నామకోప...