భారతదేశం, ఏప్రిల్ 12 -- విజయవాడ- మచిలీపట్నం నేషనల్ హైవే 65ని ఆరు వరుసలుగా విస్తరించేందుకు.. ఎన్‌హెచ్‌ఏఐ కార్యాచరణ ప్రారంభించింది. జాతీయ రహదారులను నౌకాశ్రయాలకు అనుసంధానం చేసే ప్రాజెక్టులో భాగంగా.. ఈ రహదారిని మచిలీపట్నం పోర్టు వరకూ విస్తరిస్తారు. ఇందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ముఖ్యమైన 10 అంశాలు ఇలా ఉన్నాయి.

1.విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు జాతీయ రహదారి 63 కిలో మీటర్ల మేర ఉంది. దీంట్లో అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు కంకిపాడు- ఉయ్యూరు మధ్య చలివేంద్రపాలెం సమీపంలో క్రాస్‌ అవుతుంది.

2.చలివేంద్రపాలెం నుంచి మచిలీపట్నం వరకు 44 కిలోమీటర్ల మేర ప్రస్తుతమున్న 4 వరుసల రోడ్డును ఆరు వరుసలుగా విస్తరిస్తారు. మచిలీపట్నం సమీపంలో ఒంగోలు- కత్తిపూడి జాతీయ రహదారి రెండు వరుసలుతో ఉంది. దీన్ని మాచవరం రైస్‌మిల్లు వరకు 4 కిలో...