భారతదేశం, ఫిబ్రవరి 22 -- అన్నీ సవ్యంగా జరిగి నిర్మాణంలో ఉన్న టెర్మినల్ భవనం సకాలంలో పూర్తయితే.. ఈ ఏడాదే గన్నవరం విమానాశ్రయం నుంచి.. పలు కొత్త సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా విజయవాడ - దుబాయ్ మధ్య డైరెక్ట్ ఫైట్ స్టార్ట్ కానుంది. ఇందుకు సంబంధించి సాంకేతిక సాధ్యాసాధ్యాలపై అధ్యయనం నిర్వహించిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్.. విమానాశ్రయంలో అందుబాటులో ఉన్న సాంకేతిక సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేసింది.

అయితే.. గన్నవరం విమానాశ్రయానకి ప్రధాన లోపం ఉంది. ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ నుండి నేరుగా విమానం ఎక్కడానికి వీలు కల్పించే ఏరోబ్రిడ్జి లేదు. దీనిపై విజయవాడ విమానాశ్రయ డైరెక్టర్ ఎం. లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. "ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ముగ్గురు సభ్యుల బృందం సాంకేతిక సాధ్యాసాధ్యాలపై అధ్యయనాన్ని నిర్వహించింది. విమానాశ్రయంలో అందుబా...