భారతదేశం, ఏప్రిల్ 30 -- VJA Doctor Family: విజయవాడ గురునానక్ కాలనీలో ఘోరం జరిగింది. డాక్టర్‌ ఫ్యామిలీలో Doctor family ఐదుగురు అనుమానాస్పద స్థితిలో Five killed చనిపోయారు. నగరానికి చెందిన orthopedic Surgeon ఆర్థోపెడిక్ సర్జన్‌ శ్రీనివాస్ కుటుంబ సభ్యుల్ని హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

గురునానక్ కాలనీలోని ఫ్లాట్‌ నంబర్‌ 108లో నివాసం ఉంటున్న ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ నలుగురు కుటుంబ సభ్యుల్ని హత్య చేసి ఆపై ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో శ్రీనివాస్ కుటుంబంలోని ఐదుగురు మృతి చెందారు. శ్రీనివాస్ కుటుంబం మృతిపై పోలీసులు తొలుత అనుమానం వ్యక్తం చేశారు. క్లూస్‌ టీమ్ ఆధారాలు సేకరించిన తర్వాత హత్యలు చేసిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. ఇంటి ఆవరణలో పిల్లర్‌కు ఉరేసుకున్న స్థితిలో డాక్టర్ శ్రీనివాస్ మృతదేహం ఉంది.

మృతుల్లో శ్రీనివాస్ దం...