భారతదేశం, ఏప్రిల్ 6 -- Vizianagaram Knife Attack : ఏపీలో మరో యువతిపై దాడి జరిగింది. ఇటీవల విశాఖలో ఓ ప్రేమోన్మాది యువతి, ఆమె తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువతి తల్లి మృతి చెందింది. శనివారం విజయనగరం జిల్లా గరివిడి మండలంలో మరో ఘటన చోటుచేసుకుంది. గరివిడి మండలం శివరాంలో అఖిల(18) అనే యువతిపై ఆదినారాయణ(21) అనే యువకుడు కత్తితో దాడి చేశాడు.

యువతిపై కత్తితో దాడికి పాల్పడిన నిందితుడు ఆదినారాయణను అరెస్టు చేసినట్లు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ వెల్లడించారు. దాడి జరిగిన 24 గంటల్లోగా నిందితుడిని అరెస్టు చేశామన్నారు. శనివారం అఖిలపై ఆదినారాయణ కత్తితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసు వివరాలను తాజాగా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు వెల్లడించారు. నిందితుడు దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

అఖిల తన ఇంటిలో ఉండ...