భారతదేశం, మార్చి 16 -- Vizianagaram Jobs : విజయనగరం జిల్లాలో మెడిక‌ల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ప‌రిధిలో డీసీహెచ్ హాస్పిట‌ల్‌లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. ద‌ర‌ఖాస్తు దాఖ‌లుకు ఆఖ‌రు తేదీ మార్చి 21గా నిర్ణయించారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ప‌ద్దతుల్లో భ‌ర్తీ చేస్తున్నారు.

మొత్తం 29 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. ఇందులో కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో బ‌యో మెడిక‌ల్ ఇంజ‌నీర్‌-1, ల్యాబ్ టెక్నిషియ‌న్ -2, ఆడియోమెట్రిషియన్-4, రేడియోగ్రాఫ‌ర్‌-1, ఫిజియోథెరపిస్ట్-2, ఎల‌క్ట్రీష‌య‌న్ -1 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. అవుట్‌సోర్సింగ్ ప‌ద్ధతిలో బయో స్టాటిస్టిషియన్-1, థియేట‌ర్ అసిస్టెంట్-3, మెడిక‌ల్ రికార్డ్ అసిస్టెంట్‌, రికార్డ్ అసిస్టెంట్‌-1, ల్యాబ్ అటెండంట్‌-2, జనరల్ డ్యూటీ అటెండంట్ (జీడీఏ) -10, ప్లంబ‌ర్ -1 పోస్టుల‌ను భ‌ర్...