భారతదేశం, ఫిబ్రవరి 14 -- విజయనగరం జిల్లాలో యువ ఇంజనీర్ హత్య సంచలనంగా మారింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. విజ‌యన‌గరం జిల్లా నెమ‌లాం గ్రామంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో భ‌ర్త అమాయ‌కుడైనా.. మ‌రిది ఉన్న‌త చ‌దువులు చ‌దివాడు. ఉద్యోగాల కోసం అన్వేష‌ణ‌లో ఉన్నాడు. అయితే భార్యతో దూర‌పు బంధువు ప్ర‌సాద్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌ స‌న్నిహితంగా ఉంటున్నాడు. ఆమె మొబైల్ ఫోన్‌కి ప్ర‌సాద్ మెసేజ్‌లు పంపించేవాడు. ప్ర‌సాద్ పంపించిన మెసేజ్‌ల‌ను వాట్సాప్ వెబ్ ద్వారా ల్యాప్‌టాప్‌లో ఆమె మ‌రిది చూసేవాడు.

వ‌దిన, ప్ర‌సాద్ మ‌ధ్య ఉన్న స‌న్నిహిత సంబంధం ఆమె మ‌రిదికి ఇష్టం లేదు. దీంతో అతను త‌ట్టుకోలేపోయాడు. బెంగ‌ళూరు వ‌స్తానంటే ఉద్యోగం చూస్తాన‌ని ప్ర‌సాద్ ఆమెకు పంపిన మెసేజ్‌ను చూసి మ‌రింత కోపానికి గురయ్యాడు. వ‌దిన చేస్తున్న వివాహేత‌ర సంబంధాన్ని అన్న‌...