భారతదేశం, జనవరి 26 -- విజయనగరం జిల్లా గరివిడిలోని అవంతీస్‌ సెయింట్‌ థెరిస్సా ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు వినూత్న ఆవిష్కరణ చేశారు. సోలార్‌ ఎలక్ట్రికల్‌ హైబ్రిడ్‌ వాహనాన్ని తయారుచేశారు. తమ సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించారు. సూర్య రెన్యువబుల్‌ ఎనర్జీ సిస్టమ్‌ సహకారంతో కళాశాలలో రెండు రోజులు కార్యశాల నిర్వహించారు. ఇక్కడ నేర్చుకున్న పరిజ్ఞానంతో ఈ వాహనాన్ని రూపొందించినట్లు విద్యార్థులు చెబుతున్నారు.

సోలార్‌ ప్యానల్‌ అమర్చడంతో.. వాహనం నడుస్తుండగానే ఆటోమేటిక్‌గా ఛార్జింగ్‌ అవుతుందని విద్యార్థులు వివరించారు. ఫాల్ట్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్, ఆటో కట్‌ ఆఫ్‌ ఛార్జర్, సెంట్రల్‌ లాకింగ్‌ సిస్టమ్, యాంటీ థెఫ్టింగ్‌ అలారం, బ్యాలెన్స్‌డ్‌ రియల్‌ షాక్‌ అబ్జర్వర్స్, లోడ్‌ గేర్‌ సిస్టమ్‌ వంటి పరికరాలు ఉండడం దీని ప్రత్యేకత అని విద్యార్థులు చెబుతున్నారు. ...