భారతదేశం, ఏప్రిల్ 15 -- Vizag to Vja: విశాఖ నుంచి విజయవాడకు ప్రయాణించే పలు విమానాలను విమానయాన సంస్థలు రద్దు చేయడంతో ఉత్తరాంధ్ర నుంచి రాజధానికి ప్రయాణించే వారికి చిక్కులు తప్పడం లేదు. పలు కారణాలతో విమానయాన సంస్థలు ఇటీవలి కాలంలో విశాఖ నుంచి విజయవాడ వైపు నడిచే సర్వీసుల్ని రద్దు చేస్తున్నాయి.

దీంతో విశాఖపట్నం విమానాల్లో వెళ్లడం కంటే రోడ్డు మార్గంలో ప్రయాణించడం మేలని భావిస్తున్నారు. సిక్స్‌లేన్ జాతీయ రహదారిపై ఆరేడు గంటల్లో విజయవాడ చేరుకోడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనకు ఎదురైన చేదు అనుభవాన్నీ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.

"ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం..

ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ ...