భారతదేశం, ఏప్రిల్ 4 -- రాష్ట్రంలోని ప్ర‌తిష్టాత్మ‌క ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ వైజాగ్ స్టీల్‌ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగ‌మ్ లిమిటెడ్ -ఆర్ఐఎన్ఎల్) ప్రైవేటీక‌ర‌ణ ప‌నులు చ‌క‌చ‌క జ‌రుగుతున్నాయి. ఒక‌పక్క అధికార టీడీపీ నేత‌లు ప్రైవేటీక‌ర‌ణ కాద‌ని చెబుతున్నారు. కానీ మ‌రోవైపు వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో చోటు చేసుకున్న ప‌రిణామాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ అనుకూల విధానాలు అమ‌లు జ‌రుగుతున్నాయి. పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ ఉద్యోగుల‌ తొల‌గింపు జ‌రుగుతోంది. ప‌ర్మినెంట్ ఉద్యోగులను వీఆర్ఎస్ ద్వారా ఇంటికి పంపించే చ‌ర్య‌లు చేప‌డుతున్నారు.

వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో మూడు నెల‌ల‌కు 1,400 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల‌ను తొల‌గించాల‌ని, అలా ఏడాదికి 5,600 మంది ఉద్యోగుల‌ను తొల‌గించాల‌ని స్టీల్‌ప్లాంట్‌ యాజ‌మాన్యం ల‌క్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగ...