భారతదేశం, జనవరి 30 -- ఉక్కు ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించినప్పటి నుంచే వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్లిందని.. కేంద్రమంత్రి కుమారస్వామి వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ దుస్థితి గురించి ఏపీ ఎంపీలు వివరించారని చెప్పారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయబోమని స్పష్టం చేశారు. ప్లాంట్‌ను పునర్‌నిర్మిస్తామని భరోసా ఇచ్చారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రతినిధులు, అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో కుమారస్వామి భేటీ అయ్యారు.

అనంతరం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ సాధన కోసం 30 మంది వరకు మరణించారని చెప్పారు. పరిశ్రమ ప్రారంభంలో ఉత్పత్తి బాగా ఉండేదన్న కుమారస్వామి.. 2013-14 వరకు ఉక్కు పరిశ్రమ పనితీరు బాగానే ఉందని వివరించారు. 2014లో నవరత్న హోదా సాధించిందని గుర్తు చేశారు.

'నేను కేంద్ర మంత్రి అయ్య...