భారతదేశం, ఏప్రిల్ 14 -- రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం వైజాగ్. రాష్ట్రం విడిపోయిన తర్వాత.. విశాఖ అభివృద్ధిపై ప్రభుత్వాలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాయి. పరిశ్రమలను ఆకర్షిస్తున్నాయి. ఐటీ కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్నాయి. దీంతో విశాఖ చుట్టుపక్కల భూముల రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో భూములపై పెట్టుబడి పెడితే.. భవిష్యత్తు బంగారం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

1.భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతుంది. దీంతో ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ పరంగా చాలా ముఖ్యమైనదిగా మారుతోంది. విమానాశ్రయానికి దగ్గరగా ఉన్నందున నివాస, వాణిజ్య స్థలాలకు డిమాండ్ పెరుగుతోంది. అనందపురం, తగరపువలస వంటి ప్రాంతాలు కూడా భోగాపురానికి సమీపంలో ఉండటంతో అభివృద్ధి చెందుతున్నాయి.

2.మధురవాడ..ఇది విశాఖపట్నంలోని ప్రధాన ఐట...