ఆంధ్రప్రదేశ్,విశాఖపట్నం, మార్చి 9 -- విశాఖ‌ప‌ట్నంలో ఎన్ఆర్ఐ మ‌హిళ అనుమానాస్ప‌ద మృతి చెందింది. ప్రైవేట్ స్థ‌లం లీజ్ నిమిత్తం కొన్ని రోజుల క్రిత‌మే ఆమె వైజాగ్ వ‌చ్చినట్లు తెలిసింది. ఆమె మృతి ఘటన స్థానికంగా సంచ‌ల‌నంగా మారింది. హోట‌ల్‌లోని వాష్ రూమ్ ష‌వ‌ర్‌కు సదరు మ‌హిళ ఉరేసుకున్న‌ట్లు పోలీసుల‌కు స‌మాచారం అందింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు న‌మోదు చేసి. ద‌ర్యాప్తు చేస్తున్నారు.

విశాఖ‌ప‌ట్నంలోని ఒక స్టార్ హోట‌ల్‌లో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న శ‌నివారం వెలుగులోకి వ‌చ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం. విశాఖ‌ప‌ట్నంలోని సీత‌మ్మ‌ధార‌కు చెందిన మ‌హిళ (48) ఆమెకారిలో చాలా ఏళ్ల క్రిత‌మే సెటిల్ అయింది. ఆమెకు భ‌ర్త‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. విశాఖ‌ప‌ట్నానికి చెందిన వైద్యుడు శ్రీ‌ధ‌ర్ (52) కూడా అమెరికాలోనే సెటిల్ అయ్యారు. శ్రీధ‌ర్‌...