భారతదేశం, ఏప్రిల్ 3 -- Vizag Crime: పెళ్లి చేసుకంటానని నమ్మించి మతి స్థిమితం లేని యువతిపై అత్యాచారం చేసిన ఘటన విశాఖపట్నంలో వెలుగు చూసింది. విశాఖ‌ప‌ట్నంలోని కైలాస‌పురంలోని సీఐఎస్ఎఫ్ క్వార్ట‌ర్స్ స‌మీపంలో చోటు చేసుకుంది. అయితే ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా బుధ‌వారం వెలుగులోకి వ‌చ్చింది.

కంచ‌ర‌పాలెం పోలీసులు, కుటుంబ స‌భ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్ర‌కారం ముర‌ళీన‌గ‌ర్‌లోని ఒక ప్రాంతంలో త‌ల్లిదండ్రుల‌తో కలిసి ఓ యువ‌తి (29) నివాసం ఉంటుంది. ఆ యువ‌తికి చిన్న‌ప్ప‌టి నుంచి మ‌తిస్థిమితం స‌రిగా లేదు. రోడ్ల‌పై తిరుగుతూ ఉండేంది.

మార్చి 29న బ‌ర్మా క్యాంప్‌లోని నూకాల‌మ్మ గుడికి వెళ్లింది. అక్క‌డ ఆమెను చూసిన చిత్తు కాగితాలు, బాటిల్స్‌, ఇత‌ర పారేసిన వ‌స్తువులు ఏరుకునే రాజేష్ అనే యువ‌కుడు ప‌రిచ‌యం చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి, చెర‌కు ర‌సం విక్ర‌...