భారతదేశం, ఫిబ్రవరి 17 -- వివో వీ50ని లాంచ్ అయింది. వివో నుంచి వచ్చిన ఈ కొత్త ఫోన్లో 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, ఆప్టికల్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, క్వాడ్ కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉన్నాయి. స్లిమ్ ఫోన్‌గా ఇది ఉంటుంది. వివో వీ50 స్మార్ట్‌ఫోన్‌లో జీఈఐఎస్ఎస్‌తో కూడిన కెమెరాలు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లక్షణాలను సపోర్ట్ చేస్తుంది. వివో వి50 ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం..

వివో వీ50 భారతదేశంలో మూడు మెమొరీ వేరియంట్లలో లాంచ్ అయింది. వివో వీ50 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.34,999గా నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.36,999గానూ.. 12 జీబీ ర్యామ్ ప్లస్ 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.40,999గానూ నిర్ణయించారు. ఇప్పటికే ఈ ఫోన్ ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయని, ...