భారతదేశం, మార్చి 22 -- వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ ఫిర్యాదు మేరకు.. ఐదుగురిపై కేసు నమోదు అయ్యింది. "హత్య" సినిమాలో తనతోపాటు తన తల్లిని క్రూరంగా చిత్రీకరించారని.. సునీల్ ఫిర్యాదు చేశారు. ఏ1గా "వైఎస్ అవినాష్ అన్న యూత్" వాట్సప్ గ్రూప్ అడ్మిన్ పవన్ కుమార్‍‌పై, ఏ2గా వైసీపీ సోషల్ మీడియా కడప అడ్మిన్‍పై కేసు నమోదు అయ్యింది. హత్య సినిమా డైరెక్టర్, నిర్మాత, రైటర్‍ తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు.

సునీల్ యాదవ్ ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. పవన్ కుమార్ అనే వ్యక్తి వైసీపీ వాట్సప్ గ్రూపులో వైరల్ చేస్తున్నారని సునీల్ ఫిర్యాదు చేశారు. "హత్య" సినిమాకు సంబంధించిన సన్నివేశాలు వైరల్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. "వైఎస్ అవినాష్ అన్న యూత్" వాట్సాప్ గ్రూప్‍లో వైరల్ చేస్తున్నారని సునీల్ ఫిర్యాదు చేశారు.

శనివార...