భారతదేశం, మార్చి 8 -- వివేకా హత్య కేసులో ప్రత్యక్ష, కీలక సాక్షిగా ఉన్న వాచ్ మెన్ రంగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం ముగిసింది. పులివెందులలోని బాకరాపురం శ్మశావాటికలో సుమారు 4 గంటలపాటు వైద్యబృందం, నిపుణులు రీపోస్టుమార్టం నిర్వహించారు. రంగన్న మృతదేహం నుంచి పలు అవయవాలను సేకరించిన ఫోరెన్సిక్ నిపుణులు, వాటిని భద్రపరిచి పరీక్షల కోసం ల్యాబ్ కు తీసుకెళ్లారు.

3 రోజుల కిందట వాచ్‌మెన్ రంగన్న మృతిచెందగా.. ఆయన మృతిపై భార్య సుశీలమ్మ సందేహాలు వ్యక్తం చేశారు. వాటిని నివృత్తి చేసేందుకు మరోసారి శవపరీక్ష నిర్వహించారు. మంగళగిరి, తిరుపతి నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణులు, కడప రిమ్స్ మెడికల్ కళాశాల వైద్య బృందం ఆధ్వర్యంలో.. పులివెందుల పోలీసులు, ఆర్డీవో సమక్షంలో రీపోస్టుమార్టం నిర్వహించారు.

పూడ్చిపెట్టిన రంగన్న మృతదేహాన్ని వెలికితీశారు. రంగన్న శరీరంపై ఎక్కడైనా గ...