భారతదేశం, మార్చి 15 -- వివేకానంద రెడ్డి హత్య జరిగి ఆరేళ్లు అయినా.. న్యాయం జరగడం లేదని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరు తప్ప మిగిలిన నిందితులు అందరూ బయట తిరుగుతున్నారని.. ఈ కేసులో నిందితులకన్నా తామే ఎక్కువ శిక్ష అనుభవిస్తున్నామని వాపోయారు. ఇన్వెస్టిగేషన్, ట్రయల్‌లో లోపాలు జరిగాయని సునీత ఆరోపించారు.

'వివేకానంద రెడ్డి హత్యకు గురై ఆరేళ్లయింది. ఈ కేసులో ఇంకా మాకు న్యాయం జరగలేదు. సీబీఐ కోర్టులో ట్రయల్‌ కూడా ప్రారంభం కాలేదు. నిందితుల్లో ఒకరు తప్ప మిగిలిన వాళ్లంతా బయట తిరుగుతున్నారు. ఈ కేసులో సీబీఐ మళ్లీ దర్యాప్తు మొదలు పెడుతుందని ఆశిస్తున్నాం. సీబీఐ దర్యాప్తు ముందుకు సాగకుండా నిందితులు మేనేజ్ చేస్తున్నారని అనుమానం కలుగుతోంది. ఈ కేసులో సాక్షులు అనుమానాస్పద రీతిలో చనిపోతున్నారు. సాక్షుల వాంగ్మూలాలు వెనక్కి తీసుకోవాలని కొందరు బెదిరిస్...