Hyderabad, మార్చి 5 -- బొల్లి వ్యాధి ఒక చర్మ సంబంధిత వ్యాధి. ఇది తీవ్రమైనదనే చెప్పుకోవాలి. టాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తనకు విటిలిగో అంటే బొల్లి వ్యాధి ఉందని బహిరంగంగానే చెప్పారు. తాను ఈ తీవ్రమైన చర్మసంబంధిత వ్యాధితో ఎన్నో ఏళ్లుగా బాధపడుతున్నట్టు వివరించారు. ఈ వ్యాధి కారణంగా తన చర్మం పై తెల్లటి మచ్చలు ఉంటాయని వివరించారు. దీనివల్ల కొన్నిసార్లు ఉద్యోగం కూడా రాని పరిస్థితి ఎదుర్కొన్నట్టు చెప్పారు. ఈ వ్యాధి కారణంగా తన జీవితంలో అశాంతి నిండిపోయింది అని తెలిపారు.

విజయ్ వర్మలాగే ఎంతోమంది మనదేశంలో బొల్లి వ్యాధితో బాధపడుతున్నారు. అసలు ఈ బొల్లి వ్యాధి కొందరికి ఎందుకు వస్తుంది? దీనికి నివారణ ఉందో లేదో ఈ కథనంలో తెలుసుకుందాం.

బొల్లి వ్యాధి చర్మంలోని ఏ భాగాన్ని అయినా ప్రభావితం చేయొచ్చు. ముఖం, మెడ, చేతులు ఇలా చర్మంపై ఎక్కడైనా కూడా ఈ బొల్లి వ్యాధి రావచ్చు...