Hyderabad, మార్చి 31 -- విటమిన్ కె మీ శరీర ఆరోగ్యం, శక్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. మీ రక్తపోటును స్థిరంగా ఉంచడానికి విటమిన్ కె సహాయపడుతుంది. విటమిన్ కె లోపం ఏర్పడితే చిగుళ్ల సమస్యలు, ఎముకల బలహీనత వంటి అనారోగ్యానికి దారితీస్తుంది. దీనిని నివారించడానికి, మీరు విటమిన్ కె అధికంగా ఉండే ఆహారాలు తిరాలి.

మనకు విటమిన్ కె అత్యవసరం. విటమిన్ కె తగ్గితే గాయాలు తగిలినప్పుడు రక్తం ఆగకుండా పోయే అవకాశం ఉంది. గాయం నుంచి రక్త ప్రవాహం వెంటనే ఆగిపోవాలంటే విటమిన్ కె అవసరం. ఇది వృద్ధులలో జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. విటమిన్ కె లోపం ఉన్నప్పుడు చిగుళ్లలో రక్తస్రావం జరుగుతుంది. బోలు ఎముకల వ్యాధి సంభవిస్తుంది. కాబట్టి దీన్ని నివారించడానికి మీరు తినాల్సిన విటమిన్ కె అధికంగా ఉండే ఆహారాలను చూడండి.

బ్రకోలీలో వి...