భారతదేశం, ఏప్రిల్ 8 -- మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికే విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది. ఇప్పటి వరకు మరో తేదీ ఫిక్స్ కాలేదు. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి సోషియో ఫ్యాంటసీ జానర్ చేస్తుండటంతో విశ్వంభరపై మరింత హైప్ ఉంది. ఈ చిత్రానికి విశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా, విశ్వంభర సినిమా విడుదల తేదీపై క్రేజీ రూమర్ బయటికి వచ్చింది.

విశ్వంభర సినిమాను ఈ ఏడాది జూలై 24న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారని సమాచారం బయటికి వచ్చింది. త్వరలోనే ఈ డేట్‍పై ప్రకటన వస్తుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ఇంద్ర సినిమా 2002 జూలై 24వ తేదీన విడుదలైంది. ఆ చిత్రం అప్పట్లో ఆల్‍టైమ్ ఇండస్ట్రీ హిట్ అయింది. చిరంజీవి కెరీర్లో ప్రత్యేకమైన మూవీగా నిలిచింది...