భారతదేశం, ఏప్రిల్ 12 -- తన ఇష్ట దైవం హనుమాన్ జయంతి రోజున మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కు సాంగ్ తో ట్రీట్ ఇచ్చారు. ఆయన హీరోగా నటిస్తున్న విశ్వంభర చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ నేడు (ఏప్రిల్12) రిలీజైంది. హనుమాన్ జయంతి స్పెషల్ గా మేకర్స్ రామ రామ అంటూ సాగే ఈ సాంగ్ ను రిలీజ్ చేశారు. యూట్యూబ్ లో ఈ లిరికల్ సాంగ్ వీడియో దూసుకెళ్తోంది.

విశ్వంభర మూవీ నుంచి రిలీజైన రామ రామ సాంగ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ లో జై శ్రీరామ్ అంటూ చిరంజీవి చెప్పడం హైలైట్ గా నిలిచింది. రామ రామ అంటూ సాగే ఈ పాటలో చిరు స్టెప్స్ గ్రేస్ ఫుల్ గా ఉన్నాయి. రాముని గొప్పతనాన్ని.. హనుమంతుని భక్తిని చాటుతూ సాంగ్ ఉంది. చిరంజీవి వయసు చాలా తగ్గినట్లు కనిపిస్తున్న లుక్ ఫ్యాన్స్ ను అలరిస్తోంది.

''అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. నా ఇష్ట దైవం పుట్టిన రోజున,తన ఇష్ట దైవం గుర...