భారతదేశం, ఫిబ్రవరి 15 -- విశ్వంభర చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సోషియో ఫ్యాంటసీ మూవీలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీపై ముందు నుంచి మంచి హైప్ నెలకొంది. వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతికే రిలీజ్ చేస్తామని గతంలో ప్రటించిన మేకర్స్ వాయిదా వేశారు. తాజాగా విశ్వంభర సినిమా గురించి అప్‍డేట్స్ వెల్లడయ్యాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

విశ్వంభర సినిమా కోసం ప్రస్తుతం చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. హైదరాబాద్‍లో భారీ సెట్‍లో ఈ చిత్రీకరణ సాగుతోంది. ఈ పాటలో చిరంజీవి మాస్ స్టెప్స్ ఉంటాయని తెలుస్తోంది. మాస్ బీట్‍తో ఈ సాంగ్ ఉండనుందట. ఈ మూవీ షూటింగ్ త్వరలో పూర్తవుతుందని తెలుస్తోంది.

విశ్వంభర సినిమా నుంచి చిరంజీవి కొత్త లుక్ నేడు (ఫిబ్రవరి 15) రివీల్ అయింది. గ్లాసెస్ పెట్టుకొని స్టైలిష్‍గా జీప్ వద్ద చిర...