భారతదేశం, జనవరి 29 -- మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాకు ఫుల్ క్రేజ్ ఉంది. అంజి తర్వాత చిరూ చేస్తున్న సోషియో ఫ్యాంటసీ మూవీ ఇదే కావటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. బింబిసార ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కావాల్సిన విశ్వంభర చిత్రం వాయిదా పడింది. అయితే, కొత్త డేట్ ఫిక్స్ చేసేందుకు మూవీ టీమ్‍కు మరో ఇబ్బంది ఎదురవుతోందనే సమాచారం బయటికి వచ్చింది.

విశ్వంభర సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది. అయితే, రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ బరిలో ఉండటంతో చిరూ చిత్రం పోటీ నుంచి తప్పుకుందని సమాచారం. అయితే, విశ్వంభర కోసం మే 9వ తేదీన మేకర్స్ పరిశీలిస్తున్నారని సమాచారం ఇటీవల బయటికి వచ్చింది. రాజాసాబ్ రాకపోతే ఏప్రిల్ 10వ తేదీకి కూడా రావొచ్చనే అంచనాలు వచ్చాయి. అయితే, ఈ మూవీకి రిలీజ్ డేట్‍ను ...