Hyderabad, ఏప్రిల్ 17 -- Vishwambhara Director Vassishta On Sampath Nandi Tamanna: హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి డైరెక్టర్‌గా మారారు వశిష్ట. నందమూరి కల్యాణ్ రామ్‌తో తెరకెక్కించిన బింబిసార మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో వశిష్ట దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు.

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో మైథలాజికల్ ఫాంటసీ జోనర్‌‌లో విశ్వంభర మూవీని డైరెక్ట్ చేస్తున్నారు వశిష్ట. అయితే, ఇటీవల మిల్కీ బ్యూటీ తమన్నా మెయిన్ లీడ్ రోల్ చేసిన ఓదెల 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కు హీరో శర్వానంద్‌తోపాటు డైరెక్టర్ వశిష్ట ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఓదెల 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ సినిమాకు సూపర్ విజన్ అందించిన డైరెక్టర్ సంపత్ నంది, హీరోయిన్ తమన్నాపై విశ్వంభర దర్శకుడు వశిష్ట ఆసక్తికర కామెంట్సే చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

డైరెక్టర్ వశిష్ట మాట...