Hyderabad, మార్చి 16 -- Theft In Vishwak Sen Home Gold Jewelry Gone: మాస్ కా దాస్, టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో ఆదివారం (మార్చి 16) తెల్లవారు జామున భారీ దొంగతనం జరిగింది. హైదరాబాద్ ఫిలింనగర్‌ రోడ్డు నెంబర్‌- 8లోని విశ్వక్ సేన్ ఇంట్లోకి చొరబడిన ఓ దుండగుడు చేతికందిన సొత్తను తీసుకుని పరారయ్యాడు.

తమ ఇంట్లో చోరీ జరిగినట్టు విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు ఫిలింనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దుండగుడి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. కాగా విశ్వక్ సేన్ కుటుంబమంతా ఒకే ఇంట్లో ఉంటోంది. విశ్వక్ సేన్ సోదరి వన్మయి బెడ్ రూమ్ మూడో అంతస్తులో ఉంటుంది.

అయితే ఆదివారం తెల్లవారుజామున వన్మయి గదిలో వస్తువులన్ని చిందరవందరగా పడి ఉన్నాయి. అనుమానం వచ్చిన ఆమె రూమ్‌లోని ఆల్మారాలను పరిశీలించింది. కానీ, అక్కడ ఉండాల్సిన బంగారు ఆభరణా...