భారతదేశం, మార్చి 27 -- విశ్వ‌క్‌సేన్ హిట్టు అనే మాట విని చాలా కాల‌మైంది. అత‌డి గ‌త సినిమాలు లైలా డిజాస్ట‌ర్‌గా నిల‌వ‌గా...మెకానిక్ రాకీ బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్‌గా నిలిచింది.

లైలా త‌ర్వాత ఫంకీ పేరుతో రొమాంటిక్ ల‌వ్ డ్రామా మూవీ చేస్తోన్నాడు విశ్వ‌క్‌సేన్‌. ఈ సినిమాకు జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో అఫీషియ‌ల్‌గా లాంఛ్ అయ్యింది.

ఫంకీ మూవీపై నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. ఫంకీ మూవీ క‌ల్కి డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ బ‌యోపిక్‌లా ఉంటుంద‌ని అన్నారు. ఈ సినిమాలో విశ్వ‌క్‌సేన్ ఓ సినిమా డైరెక్ట‌ర్‌గా క‌నిపిస్తాడ‌ని నిర్మాత అన్నాడు. ఇందులో హీరోయిన్ ప్రొడ్యూస‌ర్ కూతు...