భారతదేశం, మార్చి 8 -- నటీనటుల కెరీర్లో ఒడిదొడుకులు సహజమే. ప్రశంసలు, విమర్శలు వస్తూనే ఉంటాయి. అయితే, తక్కువ వ్యవధిలోనే ఈ రెండు ఎక్కువగా ఎదురైనప్పుడు కాస్త ఫోకస్ అధికంగా ఉంటుంది. యంగ్ హీరో విశ్వక్ సేన్ విషయంలో ఇదే జరిగింది. విశ్వక్ హీరోగా నటించిన గామి చిత్రం సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు (మార్చి 8, 2024) థియేటర్లలో రిలీజైంది. అయితే, అప్పటికి.. ఇప్పటికి విశ్వక్ పరిస్థితి పూర్తి రివర్స్‌లో ఉంది.

గామి చిత్రం రిలీజైన రోజు విశ్వక్‍సేన్‍పై ప్రశంసల వర్షం కురిసింది. ప్రేక్షకులతో పాటు విశ్లేషకులు కూడా అతడి పర్ఫార్మెన్స్‌ను పొగిడారు. మానవ స్పర్శతో తీవ్రమైన సమస్య ఉన్న శంకర్ అనే అఘోర పాత్రలో తన నటనతో విశ్వక్ మెప్పించారు. తన అరుదైన సమస్యను పరిష్కరించుకునేందుకు సవాళ్లను అధిగమిస్తూ హిమాలయాల్లో చేసే కఠినమైన ప్రయాణంలో ఇంటెన్సిటీతో ఆకట్టుకున్నారు. ఎమోషనల్ స...