భారతదేశం, ఏప్రిల్ 11 -- OTT: వింక్ గ‌ర్ల్ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ హీరోయిన్‌గా న‌టించిన క‌న్న‌డ మూవీ విష్ణుప్రియ ఓటీటీలో రిలీజైంది. శుక్ర‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేట‌ర్ల‌లో రిలీజైన దాదాపు యాభై రోజుల త‌ర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రావ‌డం గ‌మ‌నార్హం.

రొమాంటిక్ ల‌వ్ డ్రామాగా తెర‌కెక్కిన విష్ణుప్రియ‌ మూవీలో శ్రేయాస్ మంజు హీరోగా న‌టించాడు. సీనియ‌ర్ డైరెక్ట‌ర్ వీకే ప్ర‌కాష్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 8.3 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది. విష్ణుప్రియ మూవీతో ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ క‌న్న‌డంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రున థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది.

1990 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా విష్ణుప్రియ మూవీని ద‌ర్శ‌కుడు వీకే ప్ర‌కా...